:

1 Thessalonians 2

1

"సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని"

2

"మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది, ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలియును."

3

"ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తము కాదు గాని,"

4

"సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యుల మని దేవుని వలన ఎంచబడినవారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము."

5

"మీరెరిగియున్నట్టు మేము ఇచ్ఛకపు మాటలనైనను, ధనపేక్షను లోభత్వమును కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడును వినియోగింప లేదు; ఇందుకు దేవుడే సాక్షి."

6

"మరియు మేము క్రీస్తు యొక్క అపొస్తలులమై యున్నందున అధికారము చేయుటకు సమర్థులమై యున్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు."

7

"అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై శిశువుల వలె యుంటిమి."

8

మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడ మీ కిచ్చుటకు సిద్ధపడి యుంటిమి.

9

"అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా? మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము జేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి."

10

"మేము విశ్వాసులైన మీ యెదుట ఎంత భక్తి గాను నీతి గాను అనింద్యము గాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి."

11

తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని

12

"మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని యెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును."

13

ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చి వర్తమానవాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.

14

"అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి."

15

"ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి జేయుటకై, ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంక పరచుచు,"

16

దేవునికి ఇష్టులు కాని వారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు; దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చెను.

17

"సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్దికాలము మిమ్మును ఎడబాసియున్నను మనస్సును బట్టి మీ దగ్గర నుండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి."

18

కాబట్టి మేము మీ యొద్దకు రావలెనని యుంటిమి; పౌలును నేను పలుమారు రావలెనని యుంటిని గాని సాతాను మమ్మును అభ్యంతర పరచెను.

19

"ఏలయనగా, మా నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాక సమయమున ఆయన యెదుట మీరే గదా?"

20

నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై యున్నారు.

Link: